తెలంగాణ

telangana

ETV Bharat / state

Spandana: ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. సరిహద్దుల నిర్ధరణకు సర్వే - సంగారెడ్డి జిల్లావార్తలు

సంగారెడ్డి జిల్లా కొల్లూరు భూ అక్రమాలపై ఈటీవీ భారత్ కథనాలకు స్పందన వచ్చింది. ఇవాళ ప్రభుత్వ, ప్రైవేటు భూముల మధ్య సరిహద్దుల నిర్ధరణకు సర్వే చేయనున్నారు అధికారులు. భూ దస్త్రాలతో రావాలని సర్వే ల్యాండ్ రామచంద్రాపురం తహశీల్దార్‌కు రికార్డ్స్ శాఖ ఏడీ మధుసూదన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Officers Responded on  Kolluru land grab
సంగారెడ్డి జిల్లా కొల్లూరు భూ అక్రమాలపై ఈటీవీ భారత్ కథనాలకు స్పందన

By

Published : Aug 7, 2021, 5:01 AM IST

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో బాహ్య వలయ రహదారి సమీపంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై "హద్దుల్లేని అక్రమాల పేరిట'..... ఈటీవీ భారత్ ఇచ్చిన కథనాలతో అధికారుల్లో స్పందన వచ్చింది. ప్రైవేట్‌, ప్రభుత్వ భూముల మధ్య సరిహద్దుల నిర్ధరణకు సర్వే అండ్ రికార్డ్స్, రెవెన్యూశాఖలు సంయక్త సర్వేకు ఉపక్రమించాయి. ఈ మేరకు సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఏడీ మధుసూదన్, రామచంద్రాపురం తహశీల్దారుకు ఉత్తర్వులు పంపించారు.

శనివారం ఉదయం భూ దస్త్రాలు, మండల సర్వేయర్‌తో అక్రమణలు జరిగిన భూముల వద్దకు రావాలని.. అందులో పేర్కొన్నారు. ఆ సంయుక్త సర్వేలోనైనా వాస్తవాలు నిగ్గు తేల్చుతారో లేక ఎప్పటిలాగే తూతూమంత్రంగా పూర్తిచేస్తారో చూడాలని స్థానికులు చెబుతున్నారు.


ఇదీ చూడండి:

\LAND GRAB: కోట్ల విలువైన ప్రభుత్వ భూములు.. ఆక్రమణలతో అన్యాక్రాంతం

ABOUT THE AUTHOR

...view details