సంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ లతో బడ్జెట్ పద్దులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 2020-21 , సవరణ బడ్జెట్ 2019-20వ ఆర్థిక సవంత్సరం సవరించిన బడ్జెట్ ఆమోదంపై చర్చించారు. పురపాలక సంఘం నిధులను పార్కులు వైకుంఠ ధామాలు, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, సమీకృత సంతల అభివృద్ధి జంతు వధ శాలల నిర్మాణం ,డంప్ యార్డ్ ల నిర్వహణ హరితహరం కార్యక్రమాలకు కేటాయించాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీలలో గడువులోపు పన్నులు వసూళ్లు చేయాలని.. సకాలంలో వసూళ్లు చేస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికి మాస్క్, గ్లౌస్ లు విధిగా ఇవ్వాలని పేర్కొన్నారు.
“మాస్క్ లేనిదే - వస్తువులు లేవు, సేవ లేదు” - సంగారెడ్డి జిల్లాలో బడ్జెట్ పద్దులపై కలెక్టర్ సమీక్ష
బడ్జెట్ పద్దులపై సంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ లతో కలెక్టర్ ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. 2020-21 , సవరణ బడ్జెట్ 2019-20వ ఆర్థిక సవంత్సరం సవరించిన బడ్జెట్ ఆమోదంపై చర్చించారు. మున్సిపాలిటీలో గడువులోపు పన్నులు వసూళ్లు చేయాలని.. సకాలంలో వసూళ్లు చేస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.
“మాస్క్ లేనిదే - వస్తువులు లేవు, సేవ లేదు”
మున్సిపాలిటీలో కరోనా పై తీసుకోవాలసినా జాగ్రత్తలను కలెక్టర్ ధర్మారెడ్డి కమీషనర్ లకు సూచించారు. అన్ని మున్సిపాలిటీలలో దుకాణంలో పనిచేసే వారు, వినియోగదారులు మాస్క్ లు తప్పనిసరి ధరించాలన్నారు. “మాస్క్ లేనిదే - వస్తువులు లేవు / సేవ లేదు” అనే విధానాన్ని అనుసరించాలని స్పష్టం చేశారు. 4 , 5 అడుగులతో భౌతిక దూరం కోసం గుర్తులు వేయి౦చాలని, నాన్-వెజ్ మార్కెట్, చేపల మార్కెట్ లలో పరిశుభ్రత పాటించాలని యజమానులను ఆదేశించారు.