సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి రైతులు అవస్థలు పడ్డారు. పటాన్‌చెరు శివారు బాహ్య వలయ రహదారి సర్వీస్ రోడ్డుపై ఆరబోసిన ధాన్యం వర్షంలో తడిసిపోయింది.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: కలెక్టర్
పంట చేతికొచ్చిన వేళ అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన పంట తడిసిపోయింది. ఈ నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తమకు పరిహారం కల్పించాలని రైతులు వేడుకున్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: కలెక్టర్
అనుకోకుండా పడ్డ భారీ వర్షంతో తీరని నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన చెందారు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం నుంచి బాధిత రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగానికి సూచించారు.
ఇదీ చూడండి:కరోనా భయంతో బెంబేలెత్తుతున్న రేషన్ డీలర్లు