ప్రజా ఆరోగ్యం, శాంతి భద్రతల దృష్ట్యా మే 1వ నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) సెక్షన్‌లు అమలులో ఉంటాయని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. యాక్ట్ ప్రకారం పోలీసుల అనుమతి లేకుండా జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.
జిల్లాలో అమలులో ప్రత్యేక చట్టాలు : ఎస్పీ చందనదీప్తి - సంగారెడ్డి ఎస్పీ చందన దీప్తి
నేటి నుంచి నెలాఖరు వరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చట్టాలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లాలో ప్రత్యేక చట్టాలు అమలు: ఎస్పీ
ప్రజా ధనాన్నికి నష్టం కలిగించిన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.