సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గారిడేగమలో ఓ వ్యక్తిక కరోనా కేసు నమోదైంది. బాధితుడు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వలస వెళ్లాడు. ఈ నెల 10న స్వగ్రామానికి వచ్చాడు. దగ్గు జ్వరంతో 3 రోజుల క్రితం నారాయణఖేడ్ లోని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు.
సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసు... గ్రామం మొత్తం క్వారంటైన్ - సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసు... గ్రామం మొత్తం క్వారంటైన్
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గారిడేగమలో ఓ వ్యక్తిక కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపింది. బాధితుడు తిరిగిన ప్రదేశాలు, కలిసిన వ్యక్తులందరిని హోమ్ క్వారంటైన్ చేశారు. బాధితుని గ్రామంతో పాటు చికిత్స పొందిన ఆసుపత్రులను కూడా అధికారులు క్వారంటైన్ చేశారు.
Corona case in sangareddy district
ఎంతకు తగ్గకపోవటం వల్ల బాధితున్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటివ్ గా నిర్ధరించారు. విషయం తెలుసుకున్న అధికారులు… బాధితుడు తిరిగిన గారిడేగమ గ్రామంతో పాటు నారాయణ ఖేడ్ లోని ఆయా ఆసుపత్రులు, కుటుంబ సభ్యులు, అతడిని కలిసిన వారిని హోమ్ క్వారంటైన్ చేశారు.
అతడు తిరిగిన ప్రదేశాలను పోలీసులు గుర్తిస్తున్నారు. గ్రామంలో శానిటేషన్ చేశారు. గ్రామంలో ఎవ్వరిని ఇళ్ల నుంచి బయటకు రానివ్వటం లేదు.