తెలంగాణ

telangana

ETV Bharat / state

మౌలిక వసతులతో ప్రయాణ ప్రాంగణం ప్రారంభం - మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్​బే ను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ప్రారంభించారు. రూ.19.98 లక్షలతో ప్రయాణికులకు అనుకూలంగా అన్ని వసతులతో నిర్మించినట్లు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలకు బస్సులు తిరుగుతాయని పేర్కొన్నారు.

new bus bay inauguration in sangareddy district
మౌలిక వసతులతో నూతన ప్రయాణ ప్రాంగణం ప్రారంభం

By

Published : Sep 28, 2020, 1:57 PM IST

ప్రయాణికులకు అనుకూలంగా లింగంపల్లి కూడలిలోని నూతన ప్రయాణ ప్రాంగణంలో మౌలిక వసతులు కల్పించినట్లు పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. రూ.19.98 లక్షలతో బస్ బే నిర్మించామని అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం గ్రేటర్ డివిజన్ పరిధిలోని లింగంపల్లి చౌరస్తాలో కొత్త ప్రయాణ ప్రాంగణాన్ని మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు.

ఉమ్మడి జిల్లాలోని ప్రాంతాలకు...

జిల్లా ముఖద్వారం నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్తారని మహిపాల్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలకు ఈ ప్రయాణ ప్రాంగణం నుంచి బస్సులు తిరుగుతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సర్వేతో గట్టు గొడవలు లేకుండా పోతాయి: హరీశ్ రావు

ABOUT THE AUTHOR

...view details