గురువారం ఉదయం శంకరయ్య, తుజారాం, రాజ్ కుమార్ అనే ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు విధులకు వచ్చారు. ఆసుపత్రిలోనే ఫుడ్ కాంట్రాక్టరుగా ఉన్న జలీల్ వారిని తన సొంత పనుల నిమిత్తం బయటకు తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న 'ఈటీవీ ఈనాడు" అధికారులతో మాట్లాడగా వారు హాజరు పట్టికను చూపకుండా జాప్యం చేసి చివరికి హాజరు పట్టీలో దిద్దుబాటు చేసి చూపించారు.గుత్తేదారుని సంప్రదించగా కార్మికులు ఈ రోజు విధులకు హాజరు కాలేదని బుకాయించాడు.
ఇప్పటికైనా గుత్తేదారుల తీరుపై దృష్టి సారించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.
హాజరు వేయించుకుని మాయమవుతున్న ఒప్పంద కార్మికులు - ఒప్పంద కార్మికులు హాజరు వేయించుకుని మాయమవుతున్నారు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుత్తేదారులు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దవాఖానాలో విధులకు హాజరైన పారిశుద్ధ్య కార్మికులను కాంట్రాక్టర్లు సొంత పనులకు వినియోగించుకుంటున్నారు. గుత్తేదార్ల నిర్లక్ష్య వైఖరిపై "ఈటీవీ భారత్" క్షేత్రస్థాయి పరిశీలనాత్మక కథనం.
![హాజరు వేయించుకుని మాయమవుతున్న ఒప్పంద కార్మికులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2761520-22-ecc2f36a-cade-4a79-8e6e-78a92bd0e5c2.jpg)
ఒప్పంద కార్మికులు హాజరు వేయించుకుని మాయమవుతున్నారు
ఒప్పంద కార్మికులు హాజరు వేయించుకుని మాయమవుతున్నారు