సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఇసుక బావి వద్ద మురుగుకాలువపై వరద ఉద్ధృతికి ఓ వ్యక్తి కారుతో సహా కొట్టుకుపోయిన ఘటనలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉదయం నుంచి గాలిస్తున్నారు. మురుగు కాలువలో విరిగిన చెట్లు, చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల వెతుకులాటకు అడుగడుగునా ఆటంకం కలిగుతోంది.
కొట్టుకుపోయిన కారు వెతుకులాటకు ఆటంకంగా మారిన చెత్త - missing aman with car updarts
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఇసుక బావి వద్ద కారుతో సహా ఓ వ్యక్తి కొట్టుకుపోగా... ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం గాలింపునకు ఆటంకంగా మారింది.
ndrf police searching car and Interrupting trees
హిటాచి సాయంతో చెత్తాచెదారాన్ని తొలగిస్తూ... ఎన్టీఆర్ఎఫ్ బృందం ముందుకు పోనిస్తున్నారు. ఎక్కడ చెత్తాచెదారం పెద్దఎత్తున పేరుకుపోయిందో అక్కడ కారు చిక్కుకుపోయిందేమోనని సిబ్బంది వెతుకుతున్నారు. సాయంత్రానికి కారు దొరికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు