జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ అతిథి గృహం నుంచి బ్లాక్ రోడ్డు మీదుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శిస్తూ ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు.
జహీరాబాద్‌లో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం - latest news on National Voter Day in Zahirabad
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు.
![జహీరాబాద్‌లో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం National Voter Day in Zahirabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5836690-497-5836690-1579942547787.jpg)
జహీరాబాద్‌లో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
అనంతరం డిగ్రీ కళాశాల ఆవరణలో భారీ మానవహారం నిర్వహించి.. ఓటరు ప్రతిజ్ఞ చేశారు. 18 ఏళ్లు నిండిన పౌరులందరూ ఓటరుగా నమోదై.. బాధ్యతగా ఓటు వేయాలని అధికారులు విద్యార్థులకు పిలుపునిచ్చారు.
జహీరాబాద్‌లో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
ఇవీ చూడండి : వార్డుల్లో గెలిచినా... పీఠం దక్కించుకోని కాంగ్రెస్..!