సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్లో 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఎయిర్ వాటర్ సంస్థ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
'డ్రైవింగ్ చేసే ముందు.. కుటుంబాన్ని గుర్తు చేసుకోండి'
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు.
'డ్రైవింగ్ చేసేముందు.. కుటుంబాన్ని గుర్తు పెట్టుకోండి'
డ్రైవింగ్ చేసే ముందు.. వాహనదారులు తమ కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు. అప్పుడే సురక్షితంగా ఇంటికి చేరుకోగలరని వివరించారు. ప్రతి ఒక్కరూ.. భద్రత నియమాలు పాటిస్తే ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదన్నారు. నియమాలను పాటిస్తామని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీ చదవండి:ఎదురుగా వస్తోన్న వాహనాన్ని తప్పించబోయి.. బోల్తాపడిన కారు