తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజీమార్గమే రాజమార్గమని నమ్మండి... సమస్యను పరిష్కరించుకోండి'

రాజీ మార్గమే రాజమార్గమని కక్షిదారులు పరస్పర అంగీకారంతో వస్తే సత్వరమే ఇరువురికి న్యాయం చేకూరుతుందని జూనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్​ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

national lok adalat program in zaheerabad
'రాజీమార్గమే రాజమార్గమని నమ్మండి... సమస్యను పరిష్కరించుకోండి'

By

Published : Feb 8, 2020, 12:31 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి పాల్గొని కేసులను పరిష్కరించారు. కేసుల విషయంలో కక్షిదారులు పట్టింపులు, పంతాలకు పోకుండా రాజీ మార్గాన్ని ఎంచుకుని వస్తే సత్వరమే ఇరువురికి న్యాయం జరుగుతోందని సూచించారు.

'రాజీమార్గమే రాజమార్గమని నమ్మండి... సమస్యను పరిష్కరించుకోండి'

ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా కోర్టు కల్పించే జాతీయ లోక్ అధాలత్​ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్జి సూచించారు.

ఇవీ చూడండి:'రాష్ట్రాన్ని క్రీడా హబ్​గా మారుస్తాం'

ABOUT THE AUTHOR

...view details