NGT notices on NIMZ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్‌కు కేంద్ర పర్యావరణశాఖ అనుమతులపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జహీరాబాద్ నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులపై గణపతి దీక్షిత్ సహా పలువురు రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. నిమ్జ్ ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ కోరింది.
NGT notices on NIMZ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసులు - జహీరాబాద్ నిమ్జ్
NGT notices on NIMZ
20:49 August 16
NGT notices on NIMZ జహీరాబాద్ నిమ్జ్‌కు కేంద్ర పర్యావరణశాఖ అనుమతులపై ఎన్జీటీలో సవాల్
రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పుష్ప సత్యనారాయణ, కె. సత్యగోపాల్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. దీనిపై 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. జహీరాబాద్ నిమ్జ్‌ను 12,650 ఎకరాల్లో ప్రతిపాదించడాన్ని రైతులు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఇవీ చదవండి:వాళ్లకు బండి సంజయ్ బహిరంగ క్షమాపణలు
జైలు ఎదుట బిడ్డ మృతదేహంతో తల్లి ఆవేదన, భర్త కోసం 7 గంటలు నిరీక్షించి
Last Updated : Aug 16, 2022, 9:20 PM IST