తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యవసాయ రంగం బలోపేతానికి సర్కారు కృషి' - PatanCheru Agricultural Market Latest News

వ్యవసాయ రంగం బలోపేతానికి రైతుబంధు, రైతు బీమా, నియంత్రిత సాగు విధానం అమలు చేస్తున్నామని పటాన్​చెరు మార్కెట్ యార్డు ఛైర్​పర్సన్ హారిక విజయ్​ కుమార్ అన్నారు. అన్నదాతకు సీఎం కేసీఆర్​ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

celebration at Patancheru Market on National Farmers' Day
పటాన్​చెరు మార్కెట్​లో జాతీయ రైతు దినోత్సవ వేడుక

By

Published : Dec 23, 2020, 10:31 PM IST

రైతుకు అండగా తెరాస ప్రభుత్వం నిలుస్తోందని మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్​ హారిక విజయ్ కుమార్ అన్నారు. వ్యవసాయ రంగం బలోపేతానికి రైతుబంధు, రైతు బీమా, నియంత్రిత సాగు విధానాన్ని సీఎం కేసీఆర్​ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఆ ఘనత తెరాసదే..

జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని అన్నదాతలను ఘనంగా సన్మానించారు. పండించిన ప్రతీ పంటకు కనీస మద్దతు ధర చెల్లించి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసిన ఘనత తెరాసకే దక్కిందన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. 14 ఎకరాల్లో 10 కోట్ల రూపాయలతో మార్కెట్ యార్డును ఏర్పాటు చేశారని తెలిపారు.

ఇదీ చూడండి: వ్యవసాయ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంది: వెంకయ్య

ABOUT THE AUTHOR

...view details