నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వడగండ్ల వర్షంతో మెదక్ జిల్లా పోతులబోగుడ గ్రామంలో నేలరాలిన పంట పొలాలను అయన పరిశీలించారు. వరి, కూరగాయలు, మామిడి రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కోతలకు సిద్ధంగా ఉన్న సుమారు రెండు వందల ఎకరాలలో వరిధాన్యం నేలరాలింది. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
నేల రాలిన వరిని పరిశీలించిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి - పంటను పరిశీలించిన నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్‌రెడ్డి
అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. అరుగాలం కష్టపడి పండించిన పంట నేల రాలి రైతులకు కన్నీటిని మిగిల్చింది. నేలరాలిన పంటను పరిశీలించిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రభుత్వం సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
![నేల రాలిన వరిని పరిశీలించిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి narsapur mla madan reddy visited rice crop forms at pothula boguda village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6841253-thumbnail-3x2-srd.jpg)
నేల రాలిన వరిని పరిశీలించిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
పంట నష్టంపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ఇవ్వాలని తహసీల్దార్ భానుప్రకాష్, మండల వ్యవసాయాధికారి ప్రమీలకు ఆయన సూచించారు.
ఇదీ చూడండి:కరోనా సోకి పోలీస్ ఉన్నతాధికారి మృతి