తెలంగాణ

telangana

ETV Bharat / state

'పారదర్శకత పెంచేందుకే సామాజిక తనిఖీలు' - sangareddy news

మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా)పై చేపట్టిన సామాజిక తనిఖీపై జహీరాబాద్​లో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీ అదనపు సీఈవో ఎల్లయ్య హాజరై అవినీతి, అక్రమాలతో సహా పలు  అంశాలపై చర్చించారు.

'పారదర్శకత పెంచేందుకే సామాజిక తనిఖీలు'

By

Published : Oct 25, 2019, 1:17 PM IST

ఉపాధి హామీ పథకం వ్యయంలో పారదర్శకత పెంచేందుకే ప్రభుత్వం సామాజిక తనిఖీలు నిర్వహిస్తోందని జిల్లా పరిషత్ అదనపు సీఈవో ఎల్లయ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉపాధిహామీ పథకం-సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి జహీరాబాద్ మండల వ్యాప్తంగా 54 గ్రామాల్లో 2018-19 సంవత్సరానికి గాను చేపట్టిన రూ.25 కోట్ల పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఈనెల 15 నుంచి 24 వరకు సామాజిక తనిఖీ బృందం ప్రతినిధులు గ్రామాల్లో పనులపై వివరాల సేకరణ పూర్తి చేసి ప్రజావేదికలో సమర్పించింది. పనుల్లో అవినీతి, అక్రమాలు గ్రామాల వారీగా అధికారుల బృందం ప్రజావేదికలో చర్చించారు.

'పారదర్శకత పెంచేందుకే సామాజిక తనిఖీలు'

ABOUT THE AUTHOR

...view details