తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణఖేడ్​లో​ బ్యాంకు అటెండర్​ అనుమానాస్పద మృతి - సంగారెడ్డి నేరవార్తలు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ ఎస్​బీఐ బ్యాంక్​ అటెండర్​ మునిస్వామి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బాత్​రూంకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడని పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు.

sbi bank employee died
నారాయణఖేడ్​లో​ బ్యాంకు అటెండర్​ అనుమానాస్పద మృతి

By

Published : Jul 5, 2020, 5:55 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ పట్టణంలోని భవాని కాలనీలో విషాదం నెలకొంది. ఎస్​బీఐ బ్యాంక్​ అటెండర్​ మునిస్వామి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బాత్​రూంకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడని పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు.

మృతుడి స్వగ్రామం కర్నూలు జిల్లా అదోని. గత కొన్నేళ్లుగా నారాయణఖేడ్​ ఎస్​బీఐ శాఖలో అటెండర్​గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మునిస్వామి మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీచూడండి:కింగ్ కోఠి ఆస్పత్రిలో కరోనా లక్షణాలున్న వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details