రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం పూసలపాడ్ గ్రామంలో .. సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి: ఎమ్మెల్యే - sangareddy news
నూతన పత్తి కొనుగోలు కేంద్రాన్ని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.
''ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించండి''
నియోజకవర్గంలోని వివిధ మండలాలలో.. పత్తి కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయించాలన్నారు. రైతన్నలకు అధికారులు అన్ని విధాలా సహాయం అందించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
ఇదీ చదవండి:మత కల్లోలాలు సృష్టించేందుకు భాజపా కుట్ర: ఇంద్రకరణ్ రెడ్డి