ఎడతెరిపి లేకుండా సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి సంగారెడ్డి జిల్లాలోని చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలంలో కురిసిన వర్షాల వల్ల సిర్గాపూర్ మండలంలోని నల్లవాగుకు వరద పోటెత్తింది. నిండుకుండలా మారిన నల్లవాగు రెండడుగులకు పైగా అలుగు పారుతోంది.
భారీ వరదతో ఉవ్వెత్తున పొంగిపొర్లుతున్న నల్లవాగు
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని నల్లవాగుకు భారీగా వరద పోటెత్తింది. నిండుకుండలా మారిన వాగు రెండు అడుగులకుపైగా అలుగు పారుతోంది.
భారీ వరదతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నల్లవాగు
నల్లవాగులో పొంగడం వల్ల రెండు టీఎంసీల నీరు వృథాగా కిందకు పోతోంది. నల్లవాగు కింద దాదాపు 8వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వాగు నిండుకుండలా మారడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.