తెలంగాణ

telangana

ETV Bharat / state

'నా భర్తను చంపేశారు.. నాకు న్యాయం కావాలి'

మూడునెలల క్రితం జరిగిన తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ దుర్గ అనే మహిళ అనుమానం వ్యక్తం చేసింది. వేరే మహిళతో ఉండటం వల్ల వారే ఈ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆందోళన వ్యక్తం చేసింది.

'నా భర్తను చంపేశారు.. నాకు న్యాయం కావాలి'
'నా భర్తను చంపేశారు.. నాకు న్యాయం కావాలి'

By

Published : Jul 6, 2020, 4:29 PM IST

Updated : Jul 6, 2020, 8:22 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ముదిరాజ్ బస్తీకి చెందిన దుర్గ కొంతకాలం క్రితం ఫయాజ్ అనే వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. ఫయాజ్ ఆటో డ్రైవర్​గా ఉంటూ కొంతకాలం బాగానే కాపురం చేశారు. ఈ క్రమంలో ఇటీవలే ఓ యువతి పరిచయం అయింది. ఫలితంగా భార్య దుర్గని వేధించి వెళ్లిపోయాడు. కొన్ని రోజులకు కాలిన గాయాలతో రామచంద్రాపురంలో ఫయాజ్ మృతి చెందాడు. భర్త మరణంపై తనకు అనుమానాలున్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

పోలీసులు ఉచిత సలహాలు ఇస్తున్నారు...

చనిపోయే కొద్దిసేపటి ముందు కూడా తన సోదరికి ఫోన్ చేసి తనని ఎవరో కొడుతున్నట్లు మొరపెట్టుకున్నట్లు బాధితురాలు పేర్కొంది. ఈ విషయంపై రామచంద్రాపురం పోలీసుల వద్దకు వెళ్తే నీ భర్త తగలబెట్టుకున్నాడని.. ఏదైనా ఉంటే మాట్లాడుకో అంటూ ఉచిత సలహా ఇచ్చారని వాపోయింది. ఇప్పటికైనా తనకు న్యాయం జరగాలని లోకాయుక్త​లో ఫిర్యాదు చేశానని దుర్గ తెలిపారు. చాలామంది తనని సెటిల్​మెంట్ చేసుకోవాలని వేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. తన భర్త ఆకస్మాత్తుగా చనిపోవడానికి కారణం బహిర్గతం కావాలని... అవసరమైతే హత్యకు కారకుల ఇంటి ముందు ఆందోళన చేసేందుకు వెనుకాడనని హెచ్చరించింది.

ఇవీ చూడండి : 'పరిస్థితి దయనీయంగా ఉంది.. ప్రభుత్వం ఇకనైనా నిద్రలేవాలి'

Last Updated : Jul 6, 2020, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details