మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో జహీరాబాద్లోని ఈద్గా ప్రాంగణంలో ముస్లిం జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు.
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జహీరాబాద్లో సామూహిక వివాహలు - సంగారెడ్డి జిల్లా వేడుకలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఈద్గా ప్రాంతంలో ముస్లిం జంటలకు సామూహిక వివాహాలు జరిపి రూ. 30 వేల విలువైన సామగ్రిని మిలాద్ కమిటీ వారు అందించారు.

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జహీరాబాద్లో సామూహిక వివాహలు
ఐదు జంటలకు రూ. 30 వేల విలువైన పెళ్లి సామగ్రిని వివాహ కానుకగా అందజేశారు. మహమ్మద్ ప్రవక్త ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇస్లాం ధర్మాన్ని పాటించాలని వక్తలు సూచించారు. కార్యక్రమంలో భాగంగా విందు భోజనాలను ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి:వచ్చే వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం: మంత్రి గంగుల