తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ రహదారిపై హత్య కేసు నిందితుడు అరెస్ట్​ - హత్య

గత  నెల 31న సంచలనం సృష్టించిన హత్య కేసులో ప్రధాన నిందితుడు ఖలీల్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

జాతీయ రహదారిపై హత్య కేసు నిందితుడు అరెస్ట్​

By

Published : Jun 13, 2019, 5:39 PM IST

జాతీయ రహదారిపై హత్య కేసు నిందితుడు అరెస్ట్​

మే 31న పటాన్​చెరు జాతీయ రహదారిపై జరిగిన దారుణ హత్యకేసులో ప్రధాన నిందితున్ని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరి కొంత మంది కోసం గాలిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా ముషీరాబాద్​కు చెందిన మహబూబ్​హుస్సేన్​ను పటాన్​చెరు సమీపంలోని గత నెల 31న జాతీయ రహదారిపై అతికిరాతకంగా హత్య చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. హత్యకు సుమారు రూ. 6 లక్షలకు బేరం కుదిరినట్లుగా పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి మెహదీపట్నం సమీపంలోని ప్రధాన నిందితుడు ఖలీల్​ను పటాన్​చెరు పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుని వద్ద నుంచి తుపాకి స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి: పాఠశాల భవనం నుంచి పడి విద్యార్థిని మృతి

ABOUT THE AUTHOR

...view details