ఇళ్ల మధ్యకు వస్తున్న మురుగునీటి వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని సంగారెడ్డిలోని 29వ వార్డు గణేశ్‌నగర్ కాలనీలో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర కాలనీల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు తమ ఇళ్ల మధ్యకు చేరుతుందని... గత కొన్నేళ్లుగా ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
'పాములు, పందులు వస్తున్నాయి... బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం' - పందులు, పాములు వస్తున్నాయి... బిక్కుబిక్కుమంటు బతుకుతున్నాం
ఇళ్ల మధ్యలోకి పందులు, పాములు వస్తున్నాయని... రోజు బిక్కుబిక్కుమంటు బతుకుతున్నామని సంగారెడ్డిలోని గణేశ్‌నగర్ కాలనీవాసులు అంటున్నారు. ఇళ్ల మధ్య వచ్చే మురుగు నీటి వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
!['పాములు, పందులు వస్తున్నాయి... బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం' municipal-drainage-problem-at-ganesh-nagar-sangareddy-town](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7767789-698-7767789-1593095429884.jpg)
ఈ సమస్యతో తరచూ జ్వరం, అనారోగ్యంతో సతమతం అవుతున్నామని గోడు వెళ్ల బోసుకుంటున్నారు. పందులు, పాములు ఇళ్ల మధ్యలోకి వస్తున్నాయని... రోజు భయంతో బతుకుతున్నామని పేర్కొన్నారు. అంతేగాక ఆ డ్రైనేజీ నీరు కాలనీలో ఉన్న బోరులోనికి వెళ్లడం వల్ల ఆ నీరు కూడా కలుషితం అవుతుందన్నారు. వాడుకోవడానికి కూడా నీటిని కొనుకుంటున్నామని, రానున్న వర్షాకాలంలో ఈ సమస్యతో మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున సమస్యను త్వరగా పరిష్కరించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు స్పందించకుంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.