సంగారెడ్డిలో సెల్ టవర్ ఎక్కి పురపాలక ఒప్పంద కార్మికుడు ఆందోళనకు దిగాడు. తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని ఒప్పంద కార్మికుడు నరహరి ఆవేదన వ్యక్తం చేశాడు.
సెల్ టవర్ ఎక్కి పురపాలక కార్మికుడి ఆందోళన - సెల్ టవర్ ఎక్కిన పురపాలిక కార్మికుడు
తనను విధుల్లోకి తీసుకోవాలంటూ పురపాలక ఒప్పంద కార్మికుడు సెల్ టవర్ ఎక్కాడు. అన్యాయంగా తొలగించారంటూ ఒప్పంద కార్మికుడు నరహరి నిరసన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డిలో జరిగింది.
సెల్ టవర్ ఎక్కి పురపాలక కార్మికుడి ఆందోళన
తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు టవర్ దిగనంటూ నిరసనకు దిగాడు. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకునేందుకు శానిటరీ ఇన్స్‌పెక్టర్ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అతన్ని బుజ్జగించి కిందకు దింపారు.