సిద్దిపేట నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. చిన్నకోడూరు మండలం రామంచ, గంగాపూర్ గ్రామాలలో తెరాస అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. చిన్న కోడూరు జడ్పీటీసీ అభ్యర్థి రోజారాణి సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. గత 20 సంవత్సరాల క్రితం ఎంపీపీ ఉండి సేవలు అందించానన్నారు. చిన్నకోడూరు మండలం జడ్పీటీసీగా భారీ మెజారిటీతో గెలిపించాలని రోజారాణి ఓటర్లను అభ్యర్థించారు.
జోరుగా సాగుతున్న ప్రాదేశిక ప్రచార హోరు - compaign
ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
జోరుగా సాగుతున్న ప్రాదేశిక ప్రచార హోరు