Viral Video: సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామ పరిధిలోని గీతం విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న దిలీప్, స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న పట్నం హైవే హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లారు. అయితే అదే సమయంలో రుద్రారం గ్రామ ఎంపీటీసీ సోదరుడు నరసింహారెడ్డి అక్కడకు వచ్చి మద్యం మత్తులో హోటల్ నిర్వాహకుడిని దుర్భాషలాడుతున్నాడు. దీంతో ఎందుకు తిడుతున్నారు.. ఫుడ్ బాగోలేకపోతే మళ్లీ చేసి ఇస్తారు కదా అని నరసింహారెడ్డికి దిలీప్ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు.
Viral Video: విద్యార్థిపై ఎంపీటీసీ సోదరుడు దాడి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.. - viral video of mptc brother
Viral Video: హోటల్ నిర్వాహకుడిని దుర్భాషలాడుతుండగా సర్ది చెప్పే ప్రయత్నం చేయడమే ఈ విద్యార్థి తప్పైంది. ఇలా ఓ రాజకీయ నాయకుడి తమ్ముడికి సర్దిచెప్పబోయి దెబ్బలు తిన్నాడు. మద్యం మత్తులో అడ్డుకోబోయిన ఓ విద్యార్థిపై ఎంపీటీసీ సోదరుడు దాడికి దిగిన ఘటన సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
student
ఆగ్రహించిన నరసింహారెడ్డి నేను ఎంపీటీసీ సోదరుడను. నాకు చెప్పడానికి నువ్వు ఎవడవురా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడుతూ దాడికి దిగాడు. ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నా వినిపించుకోకుండా మళ్లీ మళ్లీ దాడి చేశాడు. దిలీప్‌ను లాక్కెళ్లి తన కారులో ఎక్కించ బోయాడు. ఈ లోగా దిలీప్ వెంట ఉన్న స్నేహితుడు రంగారెడ్డి నరసింహారెడ్డికి సర్ది చెప్పి విడిపించాడు. ఈ వ్యవహారమంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇవీ చదవండి:
Last Updated : Sep 12, 2022, 6:01 PM IST