సంగారెడ్డి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ మహేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు దిగారు. ప్రజాప్రతినిధుల తరఫున భర్తల అధికారం ఉండకూడదని ప్రభుత్వం చెప్పినా.. ఎంపీపీ లావణ్య, ఆమె భర్త దుర్గేశ్ అదేం పట్టించుకోకుండా తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.
అధికారం ఆమెదైతే.. ఆయన పెత్తనం ఏంటి? - sangareddy district news
సంగారెడ్డి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ మహేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ధర్నాకు దిగారు. తనతో దురుసుగా ప్రవర్తించిన ఎంపీపీ లావణ్య భర్తపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ డిమాండ్ చేశారు.

సంగారెడ్డిలో ఎంపీడీఓ ఆందోళన
ఉన్నతాధికారుల ఆదేశం మేరకు సమావేశం నిర్వహిస్తే.. తమకు చెప్పలేదని దుర్భషలాడారని తెలిపారు. అధికారులతో తప్పుగా ప్రవర్తించడం సరికాదన్న ఎంపీడీఓ మహేందర్ రెడ్డి ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఎంపీపీ లావణ్య, ఆమె భర్త దుర్గేశ్ తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి:రైతు సమస్యలపై అక్టోబరు 2న ఆందోళనలు: ఉత్తమ్