తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి - మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

క్రైస్తవ సోదరులకు కొత్త దుస్తులు పంపిణీ చేసి పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు గార్డెన్​లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

mp prabhakar reddy participated in the Christmas celebrations at sanareddy
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

By

Published : Dec 25, 2019, 3:14 PM IST

సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు గార్డెన్​లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పాల్గొన్నారు.

క్రైస్తవ సోదరులకు ఉన్న సమస్యలపై జిల్లా మంత్రి హరీశ్​రావుతో చర్చించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. క్రీస్తు కృపతో వచ్చే సంవత్సరం కూడా సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

ఇదీ చూడండి : లారీపై భారీ యంత్రం.. రోడ్డుపై ట్రాఫిక్​ జాం

ABOUT THE AUTHOR

...view details