సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన శాంతమ్మ పటాన్చెరు మార్కెట్లో కూరగాయల దుకాణం నిర్వహిస్తోంది. ప్రతిరోజు సాయంత్రం వచ్చి తల్లికి సహాయంగా ఉండి వెంట తీసుకెళ్లి వాడు కొడుకు. శ్రీనివాస్ సోమవారం మాత్రం ఉదయాన్నే వచ్చి కూరగాయల దుకాణం తెరిచాడు. వెనుక ఉన్న పెద్ద చెట్టు కొమ్మ విరిగి మీద పడడం వల్ల తల పగిలి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. స్థానిక వ్యాపారులు వెంటనే అతన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తల్లికి సాయంగా వస్తే...తల పగిలింది - సంగారెడ్డి జిల్లా
కూరగాయల వ్యాపారంలో తల్లికి సహాయంగా ఉందామని వచ్చాడు. కూర్చున్నచోట చెట్టు కొమ్మ విరిగి మీద పడటం వల్ల తల పగిలి ఆసుపత్రి పాలయ్యాడు.
తల్లికి సాయంగా వస్తే...తల పగిలింది