అనుమానాస్పదస్థితిలో తల్లీకూతురు మృతి - mother daughter died
కొండాపూర్ మండలం సైదాపూర్ శివారు కందిచేనులో తల్లీకుమార్తె అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. వారి మృతికి భర్తే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.
![అనుమానాస్పదస్థితిలో తల్లీకూతురు మృతి mother daughter died in suspicious condition at kondapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5489931-212-5489931-1577273009430.jpg)
అనుమానాస్పదస్థితిలో తల్లీకూతురు మృతి
తల్లీకూతురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కొండాపూర్ మండలం సైదాపూర్ శివారు కందిచేనులో తల్లి జయశీల, కుమార్తె సిరి చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు. మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉండడం వల్ల... మూడ్రోజుల క్రితం చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జయశీల మృతికి భర్తే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో తల్లీకూతురు మృతి