సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరం బండ కొత్తకాలనీకి చెందిన దుర్గా ప్రసాద్.. రామచంద్రాపురం గ్రేటర్ పరిధిలోని చెత్త సేకరించే పని చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే 25న ఉదయాన్నే చెత్త సేకరించేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం వచ్చి చూసేసరికి తన భార్య, అతని పిల్లలు ప్రభాస్, లావణ్యలు కనిపించలేదు.
తల్లీ ఇద్దరు పిల్లల అదృశ్యం వెనుక అసలు కథేంటి? - mother and children missing at sangareddy district news
సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండలో తల్లి ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. దీనితో మహిళ భర్త పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తల్లీ ఇద్దరు పిల్లలు అదృశ్యం వెనుక అసలు కథేంటి?
విషయం తెలుసుకున్న దుర్గాప్రసాద్... బంధువుల ఇళ్లలో వెతికినా.. ఇప్పటివరకు ఆచూకీ తెలియకపోవడంతో.. బాధితుడు పటాన్చెరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు సోదరుడు అయ్యే రాజు అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.