అసోం రాష్ట్రానికి చెందిన రాహుల్ దాస్ తన కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వచ్చి జీవనం సాగిస్తున్నాడు. తాను కాపలాదారుడుగా ఒక పరిశ్రమలో పని చేస్తుండగా భార్య పోపీ పాల్ మరో పరిశ్రమలో పని చేస్తోంది.
ఇస్నాపూర్‌లో తల్లి, కొడుకు అదృశ్యం - mother and son missing
షాపింగ్‌కు వెళ్లిన తల్లి, రెండేళ్ల కుమారుడు కనిపించకుండా పోయిన ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో చోటుచేసుకుంది. పలుచోట్ల వెతికిన భర్త.. భార్య, కుమారుడి ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించాడు.
ఇస్నాపూర్‌లో తల్లి, కొడుకు మిస్సింగ్
ఈనెల 12న రాహుల్ దాస్ విధులకు వెళ్లగా తాను షాపింగ్‌కి వెళ్తానని భార్య... భర్తకి ఫోన్ చేసింది. తాను వస్తానని చెప్పినా.. వినకుండా.. కుమారుడిని తీసుకొని వెళ్లిపోయింది. అప్పటినుంచి ఇంటికి తిరిగిరాలేదు. పలుచోట్ల వెతికిన రాహుల్.. ఇవాళ పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు