తెలంగాణ

telangana

ETV Bharat / state

పోస్టుమార్టమైనా సరే.. లంచం ఇవ్వాల్సిందే..! - తెలంగాణ వార్తలు

కుటుంబసభ్యులు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే... మానవత్వం మర్చిపోయి లంచాలకు తెగబడుతున్నారు సంగారెడ్డి మార్చురీ సిబ్బంది. ఈ విషయాన్ని ఈనాడు-ఈటీవీ భారత్​ సూపరింటెండెంట్​ దృష్టికి తీసుకుపోగా... బాధితులకు లంచం డబ్బులు తిరిగి ఇప్పించారు.

mortuary staff demand bribe for post mortem in sangareddy government hospital
పోస్టుమార్టమైనా సరే.. లంచం ఇవ్వాల్సిందే..!

By

Published : Dec 22, 2020, 6:28 PM IST

పోస్టుమార్టం కోసం వెళితే సిబ్బంది లంచం డిమాండ్​ చేసిన ఘటన... సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు ఈనాడు-ఈటీవీ భారత్​కు చిక్కాయి. వట్​పల్లి మండలం పల్వట్లతో కలుషిత ఆహారం తిని ముగ్గురు మృతి చెందారు. శవపరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసుల సాక్షిగా మార్చురీ సిబ్బంది లంచం డిమాండ్​ చేశారు.

రెండు మృతదేహాల పోస్టుమార్టం కోసం రూ.5 వేలు ఇవ్వాలని తేల్చి చెప్పారు. చివరికి రూ.4 వేలు ఇచ్చేందుకు మృతుల బంధువులు ఒప్పుకున్నారు. బాధితులపై సిబ్బంది వేధింపులను ఈనాడు-ఈటీవీ భారత్​... సూపరింటెండెంట్​ దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన సూపరింటెండెంట్​... సిబ్బంది తీసుకున్న లంచాన్ని బాధితులకు ఇప్పించారు. ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

పోస్టుమార్టమైనా సరే.. లంచం ఇవ్వాల్సిందే..!

ఇదీ చూడండి:'ఆర్‌బీఐ అనుమతి లేకుండానే మైక్రో ఫైనాన్స్ సంస్థల నిర్వహణ'

ABOUT THE AUTHOR

...view details