తెలంగాణ

telangana

ETV Bharat / state

Emergency Vehicles: అత్యవసర వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అత్యవసర వాహనాలను ప్రారంభించారు. వచ్చే వర్షాకాలం అత్యవసర సేవలు అందిస్తాయని తెలిపారు. మూడు డివిజన్లకు ఒక్కో బృందాన్ని కేటాయించామని వెల్లడించారు.

monsoon emergency vehicles inaugurated by mla in patancheru
అత్యవసర వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : May 31, 2021, 7:18 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మూడు అత్యవసర వాహనాలను ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రాబోయే వర్షాకాలం కోసం ఏర్పాటు చేసిన మూడు అత్యవసర బృందాలను ఏర్పాటు చేశారు. పటాన్​చెరు సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లకు ఒక్కో బృందాన్ని కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ప్రతి బృందంలో ఒక ఆటో, విపత్తు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. వర్షాల మూలంగా ఇబ్బందులు పడుతున్న కాలనీల్లో ఈ బృందాలు అత్యవసర సేవలు అందిస్తాయని వెల్లడించారు.

ఇదీ చదవండి :ఆనందయ్య మందు.. కోటయ్య మృతి

ABOUT THE AUTHOR

...view details