రైతు బజార్లో క్రయవిక్రయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్‌లో నిర్వహించిన నమూనా రైతు బజార్ ఆకట్టుకుంది. జాడి మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులతో ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేయించారు. అనంతరం పిల్లలందరితో అమ్మకం, కొనుగోళ్లు చేయించారు. అమ్మకం దారులకు ఏ మాత్రం తీసిపోకుండా విద్యార్థులు అమ్మకాలు చేపడుతూ... అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తూ... రైతుల కష్టం, సాగు చేసే పంటలు, మద్దతు ధరల గురించి విద్యార్థులకు వివరిస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహించారు.
రైతుబజార్లో కూరగాయలమ్ముతూ విద్యార్థుల సందడి - MARKET
రైతుల కష్టం తెలిసేందుకు పండిన పంటలను ఎలా అమ్మాలో ప్రయోగాత్మకంగా తెలిపేందుకు సంగారెడ్డి జిల్లా జాడి మల్కాపూర్ జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నమూనా రైతు బజార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
![రైతుబజార్లో కూరగాయలమ్ముతూ విద్యార్థుల సందడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4531045-260-4531045-1569247355459.jpg)
రైతుబజార్లో కూరగాయలమ్ముతూ విద్యార్థుల సందడి