అందుబాటులోకి ఎంఎంటీఎస్ రెండోదశ - mmts-2nd phase train-start
రెండోదశ ఎంఎంటీఎస్ దక్షిణ మధ్య రైల్వే శాఖ ఎట్టకేలకు ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం నుంచి ఇవాళ ఉదయం 5.05 గంటలకు హైదరాబాద్ నాంపల్లికి బయలుదేరింది.
ఎంఎంటీఎస్ రెండోదశ తొలిరైలు ప్రారంభం
ఎట్టకేలకు రెండోదశ ఎంఎంటీఎస్ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం వాసులకు అందుబాటులోకి వచ్చింది. ఆదివారం రాత్రి 11 గంటలకు ఎంఎంటీఎస్ రైలు ఫలక్‌నుమా నుంచి బయలుదేరి రామచంద్రాపురం స్టేషన్‌కు చేరుకుంది. ఉదయం 5 గంటల 5 నిమషాలకు నాంపల్లికి బయలుదేరింది. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా దక్షిణ మధ్య రైల్వే శాఖ సాధారణంగా ప్రారంభించింది. తొలిసారిగా వెళ్లిన రైలులో ప్రయాణికులు ఎక్కువ మంది రాలేదు.
TAGGED:
mmts-2nd phase train-start