సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో క్రైస్తవ పాస్టర్లకు ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పట్టణంలోని మెథడిస్ట్ రూరల్ చర్చిలో డివిజన్లోని పాస్టర్లకు నెలకు సరిపడా బియ్యం, పప్పు, నూనెలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు.
నిరుపేద పాస్టర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ - ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు, మహమ్మద్ ఫరీదుద్దీన్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు, మహమ్మద్ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే మాణిక్ రావులు నిరుపేద పాస్టర్లకు నిత్యావసర సరుకులను అందజేశారు.
నిరుపేద పాస్టర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ
కరోనా కారణంగా మూడు నెలలుగా చర్చిలు, మసీదులు, ఆలయాలు మూతపడి అర్చకులు, పాస్టర్లు, మత గురువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి ఆకలి తీర్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
ఇవీ చూడండి:మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం