ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయడం లేదని ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి అన్నారు. ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వడానికి కాలయాపన చేస్తుందని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, పీఆర్‌టీయూ నాయకులు చార్ల మాణయ్య ఇటీవల మృతి చెందగా... వారి కుటుంబసభ్యులను పరామర్ళించారు.
విశ్రాంత ఉపాధ్యాయుడి కుటుంబానికి ఎమ్మెల్సీ ఆర్థికసాయం - sangareddy district news
ఇటీవల మృతి చెందిన పీఆర్‌టీయూ నాయకుడు చార్ల మాణయ్య కుటుంబానికి ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి లక్షా 50 వేల రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు. సంగారెడ్డి జిల్లాలోని లింగాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు.

విశ్రాంత ఉపాధ్యాయుడి కుటుంబానికి ఎమ్మెల్సీ ఆర్థిక సాయం
మాణయ్య కుటుంబానికి లక్షా 50వేల రూపాయలను ఆర్థిక సాయంగా అందజేశారు. గ్రామంలో మాణయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్రకార్యదర్శి గుండు లక్ష్మణ్, సంగారెడ్డి, మెదక్ జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఇవీ చూడండి: 'ఉద్యోగులకు బోనస్ ప్రకటించకపోతే.. రైళ్లన్నీ ఆపేస్తాం'