ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మూడేళ్ళ తర్వాత ప్రొఫెసర్ కాశీంను ఆకస్మికంగా అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఖండించారు. సంగారెడ్డి జిల్లా జైలులో ఉన్న ఆయన్ని టీఎస్యూటీఫ్ రాష్ట్ర కార్యదర్శులు మానిక్ రెడ్డి, దత్తుతో కలిసి పరామర్శించారు.
ప్రొ. కాశీంను విడుదల చేయాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి - ప్రొ. కాశీంను విడుదల చేయాలి
ప్రొ.కాశీంను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆరోపించారు. సంగారెడ్డిలో జైలులో ఉన్న ఆయనను కలిసి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే ప్రొ. కాశీంను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
![ప్రొ. కాశీంను విడుదల చేయాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి MLC NARSI REDDY MEET PROFESSOR KASIM AT SANGAREDDY SUB JAIL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5790400-729-5790400-1579616092568.jpg)
ప్రొ. కాశీంను విడుదల చేయాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పడం అవాస్తవమని.. ప్రభుత్వం వెంటనే ప్రొ. కాశీంను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పౌర, రాజ్యాంగ హక్కులను రక్షించాలని ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ప్రొ. కాశీంను విడుదల చేయాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
Last Updated : Jan 21, 2020, 8:53 PM IST
TAGGED:
ప్రొ. కాశీంను విడుదల చేయాలి