యువతలో ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ మహారాజ్లాగా తయారవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
యువత ఛత్రపతి శివాజీలా తయారవ్వాలి : రాజాసింగ్ - సంగారెడ్డి జిల్లాలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
దేశయువత ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లి గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
తనపై ఎన్ని కేసులు పెట్టినా గోమాతను రక్షించేందుకు ముందుకెళ్తానన్నారు. గోవుల రక్షణ కోసం యువత సైనికుల్లా పనిచేయాలని సూచించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది మంచి వ్యక్తులను తయారు చేసే సంఘమని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు.