బల్దియాపై భాజపా జెండా ఎగర వేస్తుందనే భయం, ఆందోళనతోనే గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్‌కు తెరాస ప్రభుత్వం తెరలేపిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కార్యదర్శి గోదావరి భాజపాలోకి ఆహ్వానించేందుకు ఆమె నివాసానికి నాయకులతో కలిసి రఘునందన్ వెళ్లారు. గత ఎన్నికల్లో భారతీయ నగర్లో తక్కువ ఓట్లతో ఓడిపోయి తెరాసకు బలమైన దీటుగా నిలిచిన గోదావరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఆమె వస్తే భారతీ నగర్లో భాజపా గెలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పారు.
తెరాసకి ఓటమి తప్పదు
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఉన్న మూడు డివిజన్లలో తెరాస ఓడిపోతుందని ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. కారణం దుబ్బాకలో ఉన్న వారే ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.