రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ - mla-mlc-patta-pass-book-distribution
రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావ్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పంపిణీ చేశారు.

రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ 150 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలు అందక రైతులు పడ్డ అవస్థలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్ట్- బిలో అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను విడతలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 25 లక్షల రూపాయల సీసీ రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రహరి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ