రహదారి నిర్మాణపు పనులు వర్షాకాలానికి ముందే పూర్తయ్యేలా చూడాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కె. మాణిక్ రావు సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ నుంచి కోహీర్ మండలం పీచిర్యాగడి వరకు రూ. 5 కోట్లతో నిర్మిస్తున్న 8 కిలోమీటర్ల రహదారి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
'వర్షాకాలానికి ముందే రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి' - mla inspection
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో రూ. 5 కోట్లతో నిర్మిస్తున్న 8 కిలోమీటర్ల రహదారి పనులను ఎమ్మెల్యే మాణిక్రావు పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు వర్షాకాలానికి ముందే పూర్తయ్యేలా చూడాలని గుత్తేదారులను ఆదేశించారు.
'వర్షాకాలానికి ముందే రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి'
అసంపూర్తిగా ఉన్న కల్వర్టులు సహా రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ పనులు నాణ్యంగా జరిగేలా చూడాలని మాణిక్రావు సూచించారు.