తెలంగాణ

telangana

ETV Bharat / state

రాపిడ్ కిట్ల కొరత, వ్యాక్సినేషన్ సమస్యలపై ఎమ్మెల్యే ఆరా - జహీరాబాద్ వార్తలు

కొవిడ్ పరిస్థితులపై ఎమ్మెల్యే మాణిక్ రావు సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో పీహెచ్​సీల వైద్యులతో చర్చించారు. రాపిడ్ కిట్ల కొరత, వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

mla manik rao, jaheerabad, sangareddy
mla manik rao, jaheerabad, sangareddy

By

Published : Apr 27, 2021, 9:24 PM IST

నియోజకవర్గంలో కొవిడ్ పరిస్థితులపై ఎమ్మెల్యే మాణిక్ రావు సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డీఓ రమేశ్​ బాబుతో కలిసి కొవిడ్​ పరీక్షలు, పాజిటివ్ రేటు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రాపిడ్ కిట్ల కొరత, వ్యాక్సినేషన్ అవాంతరాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. వ్యాక్సిన్ కోసం పీహెచ్​సీలకు వచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. టీకా కోసం వచ్చి కరోనా అంటించుకుని వెళ్లే పరిస్థితులు రావొద్దన్నారు.

వ్యాక్సిన్, రాపిడ్​ కిట్ల కొరతపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తే.. వైద్యారోగ్యశాఖ మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వైద్యులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బంది తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టి సేవ చేయాలని సూచించారు.

ఇదీ చూడండి:'కరోనాపై పోరులో భారత్​కు యాపిల్ సాయం'

ABOUT THE AUTHOR

...view details