సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ పర్యటించారు. 617 మంది లబ్ధిదారులకు రూ. 6.17 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.
సంక్షోభంలోనూ సంక్షేమం: ఎమ్మెల్యే మాణిక్ రావు - సంగారెడ్డి జిల్లా వార్తలు
ఆర్థిక సంక్షోభంలోనూ కేసీఆర్ సర్కారు లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అందిస్తోందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లోని 617 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.

సంక్షోభంలోనూ సంక్షేమం: ఎమ్మెల్యే మాణిక్ రావు
కరోనాతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారినా.. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ అన్ని పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు.
ఇదీ చూడండి:'ఆరు నెలల్లో 175 వాయు నాణ్యత కేంద్రాలు!'