సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు. స్కూటీపై తిరుగుతూ పట్టణంలోని కాలనీలో పర్యటించారు. హమాలీ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, శాంతినగర్, బాగారెడ్డిపల్లి కాలనీలో పర్యటించి సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
'ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాల అభివృద్ధి' - mla Manik rao attend pattana pragathi
పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే మాణిక్ రావు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటించారు. సమస్యలపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
!['ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాల అభివృద్ధి' mla Manik rao attend pattana pragathi Programme in Zeherabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6264853-1100-6264853-1583136160188.jpg)
'ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాల అభివృద్ధి'
మురుగు కాలువలు, అంతర్గత రహదారులు, తాగునీటి సమస్యలపై స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అనంతరం కాలినడకన తిరుగుతూ కాలనీలో నీటి ఎద్దడిపై ఆరా తీశారు. పలువురు మహిళలు ట్యాంకర్లతో నీటి సరఫరా చేసి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.
'ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాల అభివృద్ధి'