నియోజక వర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయిన డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను ఆయన ప్రారంభించారు.
పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పర్యటన - ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. సుమారు 17 గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను ప్రారంభించారు.
![పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పర్యటన MLA Mahipal Reddy visits Patan Cheru constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8083857-1050-8083857-1595133051854.jpg)
పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పర్యటన
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ డంపింగ్ యార్డుల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. మెజార్టీ గ్రామాల్లో వైకుంఠదామాల నిర్మాణాలు సైతం పూర్తయ్యాయని అన్నారు. ప్రతి గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ, ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇదీచూడండి: 'పాఠశాలలు తెరిచేది ఆగస్టులో కాదు... సెప్టెంబర్‌లో'