తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వ్యాక్సిన్​ రెండో డోసు తీసుకున్న ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి - MLA Mahipal Reddy corona vaccine news

కరోనా వ్యాక్సిన్​ మొదటి డోసు తీసుకున్న ప్రతి ఒక్కరూ విధిగా రెండో డోసు తీసుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి సూచించారు. పటాన్​చెరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆయన కొవిడ్​ రెండో టీకా వేయించుకున్నారు.

MLA Mahipal Reddy taking the second dose of corona vaccine
MLA Mahipal Reddy taking the second dose of corona vaccine

By

Published : May 8, 2021, 7:57 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి కొవిడ్​ వ్యాక్సిన్​ రెండో డోసు తీసుకున్నారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో తన కుటుంబసభ్యులతో టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా మొదటి డోసు వేయించుకున్న ప్రతి ఒక్కరూ.. రెండో డోసు విధిగా వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇందుకు సంబంధించి వైద్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

ఎమ్మెల్యేతో పాటు జడ్పీటీసీ సుప్రజా వెంకట్​రెడ్డి దంపతులు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ దంపతులు, తెరాస పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు వ్యాక్సిన్ చేయించుకున్నారు.

ఇదీ చూడండి.. తెలుగు రాష్ట్రాలకు ప్రాణవాయువు అందించేందుకు 'మేఘా' సిద్ధం

ABOUT THE AUTHOR

...view details