సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలో ఉన్న సాకి చెరువును రూ. 20 కోట్ల నిధులతో సుందరీకరణ చేయనున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సంబంధిత పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. రూ.20 కోట్ల అంచనా వ్యయంలో హెచ్ఎండీఏ నుంచి రూ. 10 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి మిగిలిన 10 కోట్లు బ్యూటిఫికేషన్ పనులకు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.
రూ. 20 కోట్ల వ్యయంతో సాకి చెరువు సుందరీకరణ - సాకి చెరువు వార్తలు
పటాన్చెరు పరిధిలోని సాకి చెరువుకు నూతన శోభ చేకూరనుంది. రూ. 20 కోట్ల నిధులతో చెరువు సుందరీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.
![రూ. 20 కోట్ల వ్యయంతో సాకి చెరువు సుందరీకరణ saaki pond beautification](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:46:35:1619676995-tg-hyd-95-28-saki-lake-visit-av-ts10056-28042021230656-2804f-1619631416-914.jpg)
సాకి చెరువు సుందరీకరణ
చెరువు కట్టపై 40 ఫీట్ల విస్తీర్ణంతో రోడ్డు, డివైడర్, హైమాస్ట్ దీపాలు, వాకింగ్ ట్రాక్, పార్కు, కూర్చునేందుకు బల్లలు, సెంట్రల్ లైటింగ్, గార్డెనింగ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.