గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సర్వేల ఆధారంగా టిక్కెట్లు అధిష్ఠానం నిర్ణయిస్తుందని పటానుచెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో తెరాస కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో తెరాసని గెలిపించాలి: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
సర్వేల ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టికెట్లు అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన తెరాస కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
'గ్రేటర్ ఎన్నికల్లో కార్యకర్తలు.. తెరాసని గెలిపించాలి'
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మహిపాల్ రెడ్డి తెలిపారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. తెరాస విజయం కోసం గ్రేటర్ ఎన్నికల్లో కార్యకర్తలందరూ పనిచేయాలని సూచించారు.
ఇదీ చదవండి:హెలికాఫ్టర్లో గ్రామస్థుల చక్కర్లు