సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని సీతారామపురం కాలనీలో రూ. 3.6 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, మిషన్ భగీరథ పైప్ లైన్లు ఆయన ప్రారంభించారు.
పటాన్చెరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే - సంగారెడ్డి పటాన్చెరు సీసీ రోడ్లు మిషన్ భగీరథ
ప్రజల భాగస్వామ్యంతో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని సీతారామపురం కాలనీలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
![పటాన్చెరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే Development works at sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7681724-105-7681724-1592560580465.jpg)
Development works at sangareddy
ప్రణాళికాబద్ధంగా కాలనీలను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పారు. త్వరలో చేపట్టబోయే హరితహారంలో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామన్నారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.